ఆరు నెలల్లో పడిపోనున్న మమత సర్కార్!

Wed,May 29, 2019 11:48 AM

TMC Govt will fall within 6 months says BJP leader Rahul Sinha

కోల్‌కతా : తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలల్లో పడిపోనుందని భారతీయ జనతా పార్టీ నాయకులు రాహుల్ సిన్హా పేర్కొన్నారు. మమతా బెనర్జీ సర్కార్ 2021 వరకు కొనసాగలేదని, ఆరు నెలల నుంచి ఏడాది లోపు కుప్పకూలడం ఖాయమని ఆయన అన్నారు. ప్రస్తుతం మమత ప్రభుత్వం.. పోలీసులు, సీఐడీ అధికారుల సహాయంతో నడుస్తుందన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో టీఎంసీ ఘోరంగా విఫలమైన తర్వాత ఆ పార్టీ నాయకులు హింసను సృష్టిస్తున్నారని తెలిపారు. టీఎంసీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, 50 మంది కౌన్సిలర్లు నిన్న బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.

బీజేపీ నాయకుడు ముకుల్‌రాయ్ కుమారుడు సుభ్రాంగ్‌షురాయ్‌తోపాటు మరో శాసనసభ్యుడు, సీపీఐ(ఎం) ఎమ్మెల్యే సైతం కాషాయ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 40 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని, ఏడు విడుతల్లో వారంతా బీజేపీలో చేరుతారని ఎన్నికల ప్రచార సమయంలోనే ప్రధాని నరేంద్రమోదీ.. టీఎంసీ అధినాయకురాలు మమతను హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇందుకు అనుగుణంగానే ఇద్దరు టీఎంసీ ఎమ్మెల్యేలు ఆ పార్టీలో చేరడం చర్చనీయాంశమైంది. లోక్‌సభ ఎన్నిక ఫలితాల విడుదల తర్వాత.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ సుభ్రాంగ్‌షురాయ్‌ను టీఎంసీ సస్పెండ్ చేసింది.

1793
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles