టీటీడీ పాలకమండలి.. ప్రత్యేక ఆహ్వానితులుగా ఏడుగురు..

Thu,September 19, 2019 08:01 PM

అమరావతి : తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలకమండలిలో ప్రత్యేక ఆహ్వానితులుగా మరో ఏడుగురికి అవకాశం కల్పించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యేక ఆహ్వానితులుగా భూమన కరుణాకర్ రెడ్డి, రాకేశ్ సిన్హా(ఢిల్లీ), శేఖర్(చెన్నై), కుపేందర్ రెడ్డి(బెంగళూరు), గోవిందహరి(హైదరాబాద్), దుశ్మంత్ కుమార్ దాస్(భువనేశ్వర్), అమోల్ కాలే(ముంబయి) నియామకం అయ్యారు. అయితే టీటీడీ తీర్మానాల ఆమోదంలో ప్రత్యేక ఆహ్వానితులకు ఓటు హక్కు ఉండదని ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. పాలకమండలి సభ్యులతో సమానంగా ప్రత్యేక ఆహ్వానితులకు ప్రోటోకాల్ వర్తింపజేయనున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.


తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుల జాబితాను బుధవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 24 మంది సభ్యులు, నలుగురు ఎక్స్‌అఫీషియో సభ్యులతో కూడిన జాబితాతో ఉత్తర్వులు జారీచేసింది. బోర్డులో తెలంగాణ నుంచి ఏడుగురు ప్రముఖులకు అవకాశం లభించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎనిమిది, తమిళనాడు నుంచి నలుగురు, కర్ణాటక నుంచి ముగ్గురు.. ఢిల్లీ, మహారాష్ట్ర నుంచి ఒక్కొక్కరికి ఏపీ సర్కారు టీటీడీ పాలకమండలిలో చోటు కల్పించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి వీ ప్రశాంతి, ఎమ్మెల్యేలు యూవీ రమణమూర్తి, గొల్ల బాబూరావు, మల్లికార్జున్‌రెడ్డి, కే పార్థసారథి, నాదెండ్ల సుబ్బారావు, డీపీ అనిత, చిప్పగారి ప్రసాద్‌కుమార్‌కు అవకాశం కల్పించింది. తమిళనాడు నుంచి కృష్ణమూర్తి వైద్యనాథన్, ఎస్ శ్రీనివాసన్, డాక్టర్ నిచిత ముత్తవరపు, కుమారగురు.. ఢిల్లీ నుంచి ఎంఎస్ శివశంకరన్, మహారాష్ట్ర నుంచి రాజేశ్‌శర్మ, కర్ణాటక నుంచి రమేశ్‌శెట్టి, సంపత్ రవినారాయణ, సుధా నారాయణమూర్తికి అవకాశం కల్పించారు. ఎక్స్‌అఫీషియో సభ్యులుగా తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ చైర్మన్, రెవెన్యూశాఖ ప్రత్యేక కార్యదర్శి (ఎండోమెంట్), దేవాదాయశాఖ కమిషనర్, టీటీడీ ఈవో ఉంటారు

1286
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles