ఐదేళ్లూ కలిసుంటామని ఇప్పుడే చెప్పలేం!

Tue,May 22, 2018 04:35 PM

Time will answer says Congress leader DK Shiva kumar when asked about Congress JDS coalition completing five year term

బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 30 ఏళ్లుగా తాను పోరాడుతున్న జేడీఎస్‌తోనే చేతులు కలపడం ఇబ్బందిగానే ఉన్నదని అన్నారు. 1985 నుంచి గౌడలతో పోరాడుతున్నా. పార్లమెంట్ ఎన్నికల్లో దేవెగౌడ చేతుల్లో ఓడిపోయాను. ఆయన కుమారుడు, కోడలిపై మాత్రం గెలిచాను. చాలా రాజకీయాలు నడిచాయి. ఎన్నో కేసులను నేను ఎదుర్కొన్నా. కానీ పార్టీ, దేశ ప్రయోజనాల కోసం జేడీఎస్‌తో చేతులు కలపక తప్పని పరిస్థితి. ఇది రాహుల్‌గాంధీ నిర్ణయం అని శివకుమార్ అనడం గమనార్హం. ఒక్కోసారి వ్యక్తిగత నిర్ణయాలకు విలువుండదని, సంయుక్తంగా తీసుకున్న నిర్ణయానికి కట్టుబడాల్సిందేనని ఆయన అన్నారు.

ప్రభుత్వ ఏర్పాటుకు తన అంగీకారం కూడా తెలిపానని స్పష్టంచేశారు. అయితే కాంగ్రెస్, జేడీఎస్ ప్రభుత్వం ఐదేళ్లూ ఉంటుందా అన్న ప్రశ్నకు మాత్రం ఆయన నేరుగా సమాధానమివ్వలేదు. సమయమే దానికి సమాధానం చెబుతుంది. ఇప్పుడే దానిపై స్పందించలేను. మా ముందు చాలా అంశాలు, అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడే చెప్పలేను అని శివకుమార్ వెల్లడించారు. ఇక కేబినెట్ స్వరూపం అన్నది ఆలిండియా కాంగ్రెస్ కమిటీ నిర్ణయమే అని ఆయన స్పష్టంచేశారు. అయితే జేడీఎస్‌తో కాంగ్రెస్ పొత్తు అనేది 2019 ఎన్నికలకు ముందు ఏర్పడబోయే మహా కూటమికి తొలి మెట్టు అని శివకుమార్ అన్నారు.

3077
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles