ఎమ్మెల్యేగా పోటీ చేయనున్న టిక్ టాక్ స్టార్

Thu,October 3, 2019 09:39 PM

హర్యానా: ఇటీవల కాలంలో వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ లో డబ్ స్మాష్ వీడియోలు చేస్తూ చాలా మంది సెలబ్రిటీలుగా మారుతున్న విషయం తెలిసిందే. టిక్ టాక్ వీడియోతో ఫేమస్ అయి యాక్టర్లు అయినవారున్నారు. అయితే తాజాగా టిక్ టాక్ లో ఎంతోమంది ఫాలోవర్లు సంపాదించిన మహిళ ఇపుడు రాజకీయ నాయకురాలు కాబోతుంది. అవును మీరు విన్నది నిజమే. టిక్ టాక్ స్టార్ సోనాలి సింగ్ ఫొగాట్ కు బీజేపీ అదంపూర్ అసెంబ్లీ స్థానం నుంచి టికెట్ కేటాయించింది. సోనాలీకి టికెట్ కేటాయించినట్లు ప్రకటించగానే సోషల్ మీడియాలో ఆమె ఫాలోవర్లు మరింత పెరిగారు. అదంపూర్ స్థానం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది. హర్యానా మాజీ సీఎం భజన్ లాల్ 2000, 2005 ఎన్నికల్లో రెండుసార్లు ఈ స్థానం నుంచి గెలుపొందారు.


సోనాలీ సింగ్ టీవీ నటి కూడా. హర్యాన్వీ షోలో దూరదర్మన్ లో ప్రసారమయ్యే కార్యక్రమానికి యాంకర్ గా కెరీర్ ప్రారంభించింది. జీ టీవీలో పాపులర్ సీరియల్ అమ్మతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సోనాలికి ఏడేళ్ల కూతురుంది.

4490
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles