టిక్‌టాక్ బ్యాన్.. ట్విట్టర్‌లో పేలుతున్న జోకులు..!

Wed,April 17, 2019 04:37 PM

TikTok Ban Leads To Hilarious Memes And Jokes On Twitter

టిక్‌టాక్‌ యాప్‌ను గూగుల్, యాపిల్ ప్లే స్టోర్ల నుంచి తీసేసిన సంగతి తెలిసిందే కదా. దీంతో ట్విట్టర్‌లో టిక్‌టాక్ యాప్‌పై జోక్స్ పేలుతున్నాయి. రకరకాల మీమ్స్ తయారు చేస్తూ నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. సినిమా డైలాగ్స్, కొన్ని ఫన్నీ ఫోటోలు తీసుకొని టిక్ టాక్ బ్యాన్‌పై ట్వీట్లు చేస్తూ టిక్‌టాక్‌పై సోషల్ మీడియాలో చర్చకు తెర తీస్తున్నారు.

అసభ్య‌కర వీడియోల‌ను ప్ర‌మోట్ చేయ‌డ‌మే కాకుండా.. చిన్నారుల‌ను అప‌రిచిత వ్య‌క్తులు వేధింపులకు గురి చేసే అవ‌కాశం ఉంద‌ని చెబుతూ.. టిక్‌టాక్‌ను నిషేధించాల‌ని కేంద్ర ఎల‌క్ట్రానిక్స్‌, ఐటీ శాఖ.. గూగుల్, యాపిల్‌ల‌కు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్ర‌మంలోనే ఆయా సంస్థ‌లు త‌మ యాప్ స్టోర్‌ల నుంచి టిక్‌టాక్‌ను తొల‌గించాయి. ప్ర‌స్తుతం గూగుల్ ప్లే స్టోర్‌, యాపిల్ యాప్ స్టోర్‌ల‌లో టిక్‌టాక్ యాప్ క‌నిపించ‌డం లేదు.

టిక్‌టాక్ యాప్‌ను బ్యాన్ చేయాల‌ని గ‌తంలో మ‌ద్రాస్ హైకోర్టు కేంద్ర ప్ర‌భుత్వానికి సూచించిన విష‌యం విదిత‌మే. అయితే ఇదే విష‌యంపై స‌ద‌రు యాప్ డెవ‌ల‌ప‌ర్ బైట్‌డ్యాన్స్ సంస్థ‌ సుప్రీంను ఆశ్ర‌యించింది. యాప్‌ను నిషేధించాల‌ని మ‌ద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాల‌ని కోరింది. కానీ అందుకు సుప్రీం కోర్టు ఒప్పుకోలేదు. దీంతో యాప్‌ను ప్లే స్టోర్‌, యాప్ స్టోర్‌ల నుంచి తొల‌గించాల‌ని గూగుల్‌, యాపిల్‌ల‌కు కేంద్రం లేఖ‌లు రాయ‌గా.. ఆ కంపెనీలు స్పందించి టిక్ టాక్‌ను యాప్ స్టోర్స్ నుంచి తొల‌గించాయి. కాగా ఈ కేసులో ఈ నెల 24న మ‌రోసారి కోర్టులో వాద‌న‌లు జ‌ర‌గ‌నున్నాయి.

సోషల్ మీడియాలో టిక్‌టాక్ బ్యాన్‌పై వైరల్‌గా మారిన కొన్ని ట్వీట్లు చదవి కాసేపు నవ్వుకోండి.
2371
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles