ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

Wed,June 7, 2017 08:18 AM

Three terrorists killed in encounter

నాగాలాండ్: నేషనలిస్ట్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్‌కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు ఎదురు కాల్పుల్లో హతమయ్యారు. ఈ ఘటన నాగాలాండ్‌లో చోటుచేసుకుంది. మాన్ జిల్లాలోని లప్పా పరిధి తిజిట్ సర్కిళ్లో జవాన్లకు ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఉగ్రవాదుల కదలికలపై సమాచారం అందుకున్న అస్సామీ రైఫిల్స్ జవాన్లు లప్పాలో సోదాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. అదేవిధంగా ఓ జవాను మృతిచెందటంతో పాటు మరో ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి.

815
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles