రెప్పపాటులో చావును తప్పించుకున్నారు.. వీడియో

Sat,September 22, 2018 07:47 PM

three men miraculously survived in Madurai

ఓ క్షణం విలువ ఎంత అంటే లైట్ తీసుకుంటారు అంతా. కానీ.. రెప్పపాటులో చావును తప్పించుకున్న వీళ్లను అడిగితే క్షణం విలువ ఓ ప్రాణం అని చెబుతారు. ఎందుకంటే ఆ క్ష‌ణంలోనే చావును త‌ప్పించుకున్నారు వాళ్లు. అస‌లేంజ‌రిగిందంటే... బైక్‌పై ముగ్గురు వ్యక్తులు వెళ్తున్నారు. వేరే రూట్‌కు టర్న్ అవుతుండగా సడెన్‌గా ఆ రోడ్ నుంచి బస్ వెళ్తున్న విషయాన్ని గమనించలేదు. దీంతో బస్సును ఢీకొట్టింది బైక్. బైక్‌తో సహా ముగ్గురు వ్యక్తులు బస్సుతో పాటు ఈడ్చుకుంటూ కొంతదూరం వెళ్లారు. అనంతరం బస్సు డ్రైవర్ సడెన్ బ్రేక్స్ వేయడంతో బస్సు ముందు చక్రాల వరకు వెళ్లి ఆగిపోయారు. ఇంకో క్షణం బస్సు అలాగే ముందుకు వెళ్లి ఉంటే ముగ్గురి ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. కానీ.. గాయాలతో బయటపడ్డారు వాళ్లు. ఈ ఘటన తమిళనాడులోని మదురైలో చోటు చేసుకున్నది. ఈ ఘటన సెప్టెంబర్ 16న జరుగగా.. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


9577
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles