హత్య కేసు..మైనర్ సహా ముగ్గురు అరెస్ట్

Fri,September 21, 2018 09:33 PM

Three men including a minor held for killing man in Narela

న్యూఢిల్లీ: ఓ వ్యక్తి హత్య కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వీరిలో 16 ఏండ్ల యువకుడు కూడా ఉన్నాడు. సెప్టెంబర్ 12న నరేలా ప్రాంతంలో ట్రయాంగిల్ ప్రేమ విషయంలో దీపక్ అనే వ్యక్తిపై నిందితులు కత్తులతో దాడి చేశారు. దాడిని అడ్డుకునే ప్రయ్నంచిన దీపక్ స్నేహితుడు నవీన్‌పై కూడా దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన దీపక్ ప్రాణాలు కోల్పోగా..నవీన్ గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటనకు కారణమైన నలుగురు నిందితులను అరెస్ట్ చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నామని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

1953
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS