బాలిక కిడ్నాప్ యత్నం.. ముగ్గురిని కొట్టిచంపిన గ్రామస్థులు

Fri,September 7, 2018 07:08 PM

three lynched by mob in bihar

చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని సర్కారు, సుప్రీంకోర్టు ఎంతగా హితవు చెప్తున్నా దేశంలో మూకుమ్మడి దాడులు అంతకంతకూ పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. తాజాగా బీహార్‌లో ఇలాంటి ఓ ఘటనలో ముగ్గురు దుండగులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన శుక్రవారం జరిగింది. మృతులు ముగ్గురూ 20ల వయసువారే. బెగూసరాయ్‌లోని ఓ పాఠశాల వద్దకు కొందరు దుండగులు వచ్చి ఓ బాలిక గురించి వాకబు చేయడం మొదలుపెట్టారు. గడ్డికోత పని ముగించుకుని ఇండ్లకు తిరిగివెళ్తున్న ఊరి మహిళలు బడిదగ్గర ఏదో సందడి అనిపించి అటుగా వచ్చారు. దుండగులు ఆయుధాలతో బెదరించి ఓ బాలికను ఎత్తుకుపోయేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుసుకుని ఊరివాళ్లని అప్రమత్తం చేశారు. ఊరి నుంచి వచ్చిన గుంపు వారిని తరిమితరిమి కొట్టారు. పోయేవారు పోగా ఓ ముగ్గురు వారి చేతికి చిక్కారు. ఎడాపెడా అందరూ కలిసి చితకబాదడంతో వారిలో ఒకడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. మరో ఇద్దరు దవాఖానకు తరలిస్తుండగా మరణించారు. మృతుల పేర్లు ముకేశ్ మహతో, బౌనాసింగ్, హీరాసింగ్‌గా గుర్తించారు.

6886
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles