బీజేపీ కార్యాలయాలు ధ్వంసం

Mon,April 15, 2019 12:18 PM

Three booth offices of BJP vandalised in Siliguri

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారతీయ జనతా పార్టీకి చెందిన మూడు కార్యాలయాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అక్కడున్న ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి.. జెండాలను చింపేశారు. దీంతో అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బెంగాల్‌కు పారా మిలటరీ బలగాలను పంపాలని బీజేపీ జనరల్ సెక్రటరీ కైలాష్ విజయ్‌వర్గీయ ఎన్నికల కమిషన్‌ను కోరారు. ప్రతీ పోలింగ్ కేంద్రంలో సీసీటీవీ కెమెరాలు అమర్చాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని కైలాష్ విజ్ఞప్తి చేశారు.

1423
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles