ముస్లింలు, దళితులను చంపారు.. ఇప్పుడు పిల్లలపై దాడి చేస్తున్నారు!

Thu,January 25, 2018 03:22 PM

Those who killed Muslims and burnt Dalits alive are now targeting children says Aravind Kejriwal

న్యూఢిల్లీః పద్మావత్‌కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో భాగంగా స్కూల్ బస్సుపై దాడిని తీవ్రంగా ఖండించారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఇలాంటి దాడులను ఎవరూ మౌనంగా చూస్తూ ఉండకూడదని పిలుపునిచ్చారు. వాళ్లు ముస్లింలను చంపారు.. దళితులను సజీవంగా తగులబెట్టారు.. ఇప్పుడు పిల్లలపై రాళ్లు విసిరారు. మన ఇళ్లల్లోకి చొరబడుతున్నారు. ఇక ఏమాత్రం మౌనంగా ఉండకూడదు, దీనిపై స్పందించండి అంటూ కేజ్రీవాల్ అన్నారు. విభజన శక్తులకు వ్యతిరేకంగా గళమెత్తడానికి ఇదే సరైన సమయమని ఆయన చెప్పారు. ఢిల్లీలోని నార్త్ చత్రసాల్ స్టేడియంలో జరిగిన రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్‌లో కేజ్రీవాల్ ఈ కామెంట్స్ చేశారు. పిల్లలపై రాళ్లు విసరడం సిగ్గు చేటని అన్నారు. ఆ పని చేసిన వాళ్లకు రాముడు రావణుడికి వేసిన శిక్ష కంటే పెద్ద శిక్ష వేయాలని డిమాండ్ చేశారు. ఈ దేశంలో అన్ని మతస్థుల వాళ్లు ఉన్నారు. పిల్లలపై దాడి చేసిన వాళ్లు ఏ మతానికి చెందినవాళ్లు? అయినా ఏ మతం పిల్లలపై హింసను సమర్థిస్తుంది? ఇలాంటి హింసను నా దేశంలో చూడాలని అనుకోవడం లేదు. మమ్మల్ని బతకనివ్వండి అని కేంద్రాన్ని వేడుకుంటున్నాను అని కేజ్రీవాల్ అన్నారు.

1852
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles