యడ్యూరప్ప రాజీనామా ప్రజాస్వామ్య విజయం: చంద్రబాబు

Sat,May 19, 2018 06:02 PM

those who believe in democracy are happy, AP CM chandrababu on Yeddyurappa resignation

అమరావతి: యడ్యూరప్ప రాజీనామా ప్రజాస్వామ్య విజయమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. యడ్యూరప్ప రాజీనామాతో ప్రజస్వామ్యవాదులంతా ఆనందంగా ఉంటారని చంద్రబాబు తెలిపారు. గతంలో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని అప్రజాస్వామికంగా బర్తరఫ్ చేశారని సీఎం గుర్తు చేశారు. 30 రోజులు పోరాడి ఎన్టీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకున్నామని తెలిపారు. ప్రధాని మోదీ, అమిత్‌షా కలిసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. కర్ణాటక గవర్నర్ మెజారిటీ ఉన్న కాంగ్రెస్, జేడీఎస్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా పిలవకుండా.. సంప్రదాయానికి విరుద్ధంగా వ్యవహరించారని మండిపడ్డారు. కేంద్రంలో అధికారం ఉందని బీజేపీ ఒక్కో చోట ఒక్కో సంప్రదాయాన్ని అవలంభిస్తున్నదన్నారు.

4427
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS