మే నెలాఖరులోగా నైరుతి రుతుపవనాలు

Mon,April 16, 2018 04:18 PM

This year normal rainfall will occur, says IMD

న్యూఢిల్లీ: రైతులకు శుభవార్త. ఈ సంవత్సరం సాధారణ వర్షపాతం నమోదు కానున్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. నైరుతి రుతుపవనాలు మే నెలాఖరులోగా కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. ఈ సందర్భంగా నైరుతి రుతుపవనాల ఆగమనంపై ఐఎండీ డీజీ రమేశ్ మీడియా సమావేశం నిర్వహించారు. తీరం తాకిన తర్వాత నైరుతి రుతుపవనాలు దేశమంతా విస్తరించడానికి 45 రోజులు పడుతుందని ఆయన తెలిపారు. రెండో దశ రుతుపవనాల పరిస్థితిని జూన్‌లో పరిశీలిస్తామన్నారు. వరుసగా మూడో ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణంగానే ఉంటాయని రమేశ్ తెలిపారు. ప్రతి నెల రుతుపవనాల గమనాన్ని అంచనా వేసి.. వివరాలు అందిస్తామని తెలిపారు.


2271
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS