ఇండియాలో ఎంత మంది లంచాలు ఇచ్చారో తెలుసా?

Fri,October 12, 2018 12:54 PM

This year 56 percent of Indians paid Bribes reveals latest survey

న్యూఢిల్లీ: అవినీతిని అంతం చేయడానికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా దేశంలో లంచాలు ఇచ్చే వాళ్ల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. తాజాగా వెల్లడైన నివేదికే దీనికి నిదర్శనం. ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ ఇండియా, పలు స్థానిక సంస్థలు కలిసి నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. దీని ప్రకారం 2018లో 56 శాతం మంది భారతీయులు లంచాలు ఇచ్చినట్లు తేలింది. సర్వేలో భాగంగా లక్షా 60 వేల మంది అభిప్రాయాలను సేకరించారు. అంతకుముందు ఏడాది 45 శాతం మంది మాత్రమే తాము లంచాలు ఇచ్చినట్లు చెప్పగా.. ఈసారి అది 56 శాతానికి పెరగడం గమనార్హం. తమ రాష్ర్టాల్లో అవినీతి నిరోధక హెల్ప్‌లైన్ లేదని 58 శాతం మంది చెప్పగా, మరో 33 శాతం మంది అసలు ఆ హెల్ప్‌లైన్ ఉన్నట్లే తమకు తెలియదని తెలిపారు. ఇక లంచాల్లో ఎక్కువ శాతం (39) నగదు రూపంలోనే ఇచ్చినట్లు తేలింది. ఇక లంచాల్లో ఎక్కువ మొత్తం అందుకున్నది పోలీసులు కాగా.. ఆ తర్వాతి స్థానాల్లో మున్సిపల్ కార్పొరేషన్స్, ఆస్తుల రిజిస్ట్రేషన్లు, విద్యుత్, రవాణా, పన్నుల కార్యాలయాలు నిలిచాయి.

ఇక లంచాలు ఇస్తేనే తమ పని అవుతుందని 36 శాతం మంది తేల్చి చెప్పారు. ఇక పని పూర్తవడానికి లంచాలు అవసరం లేదని గతేడాది 43 శాతం మంది చెప్పగా.. ఈసారి వాళ్ల సంఖ్య 39 శాతానికి పడిపోయింది. సీసీటీవీలు ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్లోనూ తాము లంచాలు ఇచ్చామని 13 శాతం మంది చెప్పడం విశేషం. ఇక కొత్తగా సవరించిన చట్టంతో ప్రజలను మరింత వేధించడానికి ప్రభుత్వ అధికారులకు అవకాశం దక్కినట్లు 63 శాతం మంది ప్రజలు అభిప్రాయపడ్డారు. 30 ఏళ్ల కిందటి అవినీతి నిరోధక చట్టానికి సవరణ చేసిన బిల్లును ఈ మధ్యే రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదించింది.

1904
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles