మీకోసమే ఈ చిక్కు ప్రశ్న... సాల్వ్ చేయండి చూద్దాం!

Sat,October 14, 2017 05:59 PM

This viral puzzle gives you multiple answers

మెదడుకు మేత.. మనం బతకడానికి ఎలా ఆహారం తీసుకుంటామో.. మన మెదడుకు కూడా అప్పుడప్పుడు మేత వేయాలట.. అప్పుడే అది షార్ప్ అవుతుందట. లేకపోతే.. ఇనుముకు తుప్పు పట్టినట్టే మన మెదడుకూ తుప్పు పట్టిపోతుందట. అందుకే మీ మెదడు తుప్పును ఒక్క దెబ్బతో వదిలించడానికి మీకోసం ఓ పజిల్‌ను ఇస్తున్నాం.. సాల్వ్ చేయండి. మీరు పైన చూస్తున్న ఫోటోలోనే పజిల్ ఉంది. ఇంకెందుకు ఆలస్యం.. యువర్ టైమ్ స్టార్ట్స్ నవ్..

పజిల్‌ను సాల్వ్ చేశారా లేదా... జాగ్రత్తగా.. మెదడుకు పదును పెట్టారా? అయితే.. మీ ఆన్సర్ ఎంత చెప్పండి..? చాలా మంది తమ ఆన్సర్ 67 అంటారు. అలా అన్నారంటే.. మీరు ఖచ్చితంగా పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఆన్సర్ 67 కానేకాదు. మరి.. ఎంత.. మళ్లోసారి ప్రయత్నించండి..

చాలా మంది తమ ఆన్సర్ 35 అంటారు. మరి కొందరు 38 అంటారు. ఇక్కడ ఒకే ప్రశ్నకు ఇన్ని ఆన్సర్స్ ఎందుకు వస్తున్నాయో ఇప్పటికైనా మీకు అర్థమయిందా లేదా? ఇంకా అర్థం కాలేదా.. పైన లైన్ లో షట్భుజి, పంచభుజి, చతురస్రం అన్ని ఒకేదాంట్లో కలిసి ఉన్నాయి. కింది లైన్‌లో నాలుగు అరటి పండ్లు, తర్వాత గడియారం టైమ్ 3 చూపిస్తున్నది. ఇక.. లాస్ట్ లైన్‌లో ఉన్న గడియారాన్ని ఒకసారి చూడండి.. అది టైమ్ 2 చూపిస్తుంది. అరటి పండ్లు మూడే ఉన్నాయి. షట్భుజి, పంచభుజి మాత్రమే ఉన్నాయి.. లోపల చతురస్రం లేదు.

ఇప్పుడైనా పరీక్షగా గమనించారా లేదా? అందుకే ఒక్కక్కరికి ఒక్కో ఆన్సర్ వస్తున్నది. మళ్లో సారి జాగ్రత్తగా మెదడుకు పదును పెట్టి ఆన్సర్ ఎంతో రాబట్టండి. ఓకేనా..

అయితే.. ఇక్కడ ఈ పజిల్ మాత్రమే ఇవ్వడానికి ఓ రీజన్ ఉంది. గత కొన్ని రోజుల నుంచి ఈ పజిల్ మాత్రం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నది. ఓ వ్యక్తి ఈ పజిల్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అప్పటి నుంచి ఈ పజిల్‌ను సాల్వ్ చేయడానికి నెటిజన్లు తమ మెదడుకు పదును పెడుతున్నారు.

4521
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS