ఈ సారి వర్షాలు 60 శాతమే: అమెరికా వాతావరణశాఖ

Mon,March 25, 2019 10:26 PM

This time the rains are 60 percent America Meteorological Department

న్యూఢిల్లీ : వేసవి పొడవునా ఎల్‌నినో కొనసాగుతున్నందున వచ్చే వానాకాలంలో వర్షాలు కురిసే అవకాశం 60 శాతమేనని అమెరికా వాతావరణశాఖ హెచ్చరించింది. దీని ప్రభావం భారత్‌పైనా ఉంటుందని అంచనా వేసింది. గత నెలలో పసిఫిక్ మహా సముద్ర పరిధిలో బలహీనమైన ఎల్‌నినో ఆవరించిందని వివిధ వాతావరణ సంస్థలు పేర్కొన్నాయి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు బలోపేతమైతే కొన్ని నెలల పాటు ఎల్‌నినో ప్రభావం ఉంటుంది. దీనివల్ల పసిఫిక్ తూర్పు, మధ్య ప్రాంత పరిధిలో అసాధారణ రీతిలో వేడిమి నెలకొంటుందని, దీని ప్రభావం ప్రపంచంలోని పలు ప్రాంతాలపై ఉంటుందని అమెరికా హెచ్చరించింది.

సాధారణంగా వర్షాకాలంపై బలహీన ఎల్‌నినో ప్రతికూల ప్రభావం చూపుతుంది. భారత్‌లో వానాకాల సీజన్ బలహీనంగా ఉంటుంది. పసిఫిక్ సముద్ర పరిధిలో బలహీన ఎల్‌నినో ఏర్పాటైందని, దీని ప్రభావం జూన్-జూలై వరకు కొనసాగుతుందని ఈ నెల ప్రారంభంలోనే భారత్ వాతావరణ విభాగం (ఐఎండీ) పేర్కొన్నది. పలు దేశాల వాతావరణ సంస్థలు కూడా గతనెలలోనే ఎల్‌నినో ఏర్పడిన సంగతిని నిర్ధారించాయి. ఐఎండీ అధిపతి డీ శివానంద పాయి స్పందిస్తూ ఎల్‌నినో వల్ల జూన్ వరకు తటస్థ పరిస్థితులు ఉంటాయని అంచనా వేశారు. ఈ ఏడాది వానాకాలం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందన్న తొలి అంచనాలను ఐఎండీ వచ్చేనెల మధ్యలో ప్రకటించనున్నది.

2283
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles