Telangana Intermediate 1st & 2nd Year Results 2019

హోలీ ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

Wed,March 20, 2019 11:27 AM

This is why we celebrate the Festival of Colors Holi

హైదరాబాద్: రంగుల పండుగ హోలీ వచ్చేసింది. గురువారం దేశవ్యాప్తంగా ఈ పండుగను ఘనంగా జరుపుకోనున్నారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ రంగుల్లో మునిగి తేలడానికి సిద్ధమవుతున్నారు. అయితే అసలు ఈ హోలీ పండుగను ఎందుకు జరుపుకుంటారో తెలుసా? వసంతం మొదలయ్యే ముందు జరుపుకునే ఈ పండుగకు చాలా ప్రాధాన్యత ఉంది. ఇండియాలోని హిందువులు, నేపాల్ దేశస్థులు ఈ హోలీని జరుపుకుంటారు. హిందూ కేలండర్ ప్రకారం ఫాల్గుణ పౌర్ణిమ రోజున ఈ రంగుల పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు.

హోలికా నుంచి హోలీ


హిందూ పురాణాల ప్రకారం ఈ హోలీ జరుపుకోవడం వెనుక ఓ బలమైన కారణమే ఉంది. రాక్షసుల రాజు హిరణ్యకశిపుడు తెలుసు కదా. అతని సోదరే ఈ హోలికా. బ్రహ్మ దేవుడు ఇచ్చిన వరంతో హిరణ్యకశిపుడిని చంపడం దాదాపు అసాధ్యంగా మారడంతో అతడు అహంభావిగా మారతాడు. ఆ అహంకారంతోనే స్వర్గంతోపాటు భూమిపై కూడా దాడులు చేస్తుంటాడు. అయితే హిరణ్యకశిపుడి తనయుడు ప్రహ్లాదుడు మాత్రం విష్ణు భక్తుడు. దేవుడిని పూజించడం మానుకోవాలని ప్రహ్లాదునికి ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో అతన్ని చంపడానికి హిరణ్యకశిపుడు ఎన్నోసార్లు ప్రయత్నించి విఫలమవుతాడు. చివరగా తన సోదరి హోలికా ఒడిలో కూర్చోవాల్సిందిగా ప్రహ్లాదుడిని హిరణ్యకశిపుడు ఆదేశిస్తాడు. అగ్ని దహించకుండా హోలికా ఓ వరాన్ని పొందుతుంది.

ఆమె ఒడిలో ప్రహ్లాదున్ని కూర్చోబెట్టి అగ్నికి ఆహుతి చేయాలని హిరణ్యకశిపుడు భావిస్తాడు. అయితే ఆ ప్రయత్నమూ విఫలమవుతుంది. ఆ మంటల్లో హోలికా పూర్తిగా కాలిపోయి మరణిస్తుంది. ప్రహ్లాదుడు పొందిన ఈ మోక్షాన్ని, హోలికా దహనమవడాన్ని హోలీగా జరుపుకుంటారు. అందుకే హోలీకి ముందు రోజు హోలికాను దహనం చేయడం ఆనవాయితీగా వస్తున్నది. అయితే దక్షిణ భారతదేశంలో దీనినే కామదహనంగా వ్యవహరిస్తున్నారు. అయితే దీని వెనుక మ‌రో క‌థ ఉంది. త‌న త‌ప‌స్సును భంగం చేయ‌డానికి ప్ర‌య‌త్నించిన మ‌న్మ‌థుడిని శివుడు త‌న కోపాగ్నితో ద‌హ‌నం చేస్తాడు. దీనినే మ‌న్మ‌థ ద‌హ‌నం లేదా కామ‌ద‌హ‌నంగా పిలుస్తున్నారు. ఈ కామదహనం ఓ పర్వదినంగా జరుపుకోవడం అనాదిగా ఆచారంగా మారింది. కృష్ణుడు జన్మించిన మధురలో ఈ హోలీ పండుగను 16 రోజుల పాటు జరుపుకుంటారు. ఉత్తర భారతంలో హోలీ నాడు భంగు అనే మత్తు పానీయాన్ని సేవించడం కూడా ఆనవాయితీగా వస్తున్నది.

4124
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles