ఇదీ పాకిస్థాన్ నిజ స్వరూపం!Thu,November 23, 2017 04:54 PM
ఇదీ పాకిస్థాన్ నిజ స్వరూపం!

న్యూఢిల్లీ: ఉగ్రవాది హఫీజ్ సయీద్‌ను గృహ నిర్బంధం నుంచి విడుదల చేయడంపై ఇండియా తీవ్రంగా మండిపడింది. పాకిస్థాన్ ఉగ్రవాదులను ప్రధాన స్రవంతిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించింది. సయీద్ విడుదలపై ఇవాళ కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ స్పందించారు. ఉగ్రవాదులను ఏరివేయడంలో పాకిస్థాన్‌కు చిత్తశుద్ధి లేదని మరోసారి నిరూపితమైందని ఆయన అన్నారు. తనకు తాను ఉగ్రవాదినని చెప్పుకొనే వ్యక్తిని ఎలా విడుదల చేస్తారంటూ ఆయన ప్రశ్నించారు. సరైన ఆధారాలు లేవంటూ పది నెలల గృహ నిర్బంధం నుంచి హఫీజ్ సయీద్‌కు విముక్తి కల్పించింది లాహోర్ హైకోర్టు. అతను బయటకు రాగానే.. కశ్మీర్ స్వాతంత్య్రం కోసం పోరాడతానని ఇండియాకు మరో వీడియో సందేశాన్ని కూడా పంపించాడు.


1414
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS