సువర్ణాక్షరాలతో లిఖించిదగ్గ రోజు ఇది: శివసేన అధ్యక్షుడు

Sat,November 9, 2019 05:11 PM

ముంబయి: ఈ రోజు సువర్ణాక్షరాలతో రాయదగ్గదని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే ట్విట్టర్ వేదికగా స్పందించారు. అయోధ్య కేసులో సుప్రీం కోర్టు ఈ రోజు కీలక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ కేసులో సుప్రీంకోర్టు ఐదుగురు ప్రధాన న్యాయమూర్తుల ధర్మాసనం తుది తీర్పు వెలువరిస్తూ.. ఆ భూమి ముమ్మాటికీ రామజన్మ భూమేనని తీర్పిచ్చింది. సున్నీ వక్ఫ్‌బోర్డుకు ప్రత్యామ్నయంగా అయోధ్యలోనే 5 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని తీర్పులో పేర్కొన్నారు. ఈ తీర్పుపై హర్షం వ్యక్తం చేసిన ఉద్దవ్ థాక్రే.. ఈ తీర్పును ప్రతి ఒక్కరూ గౌరవించాలని తెలిపారు. ఈ నెల 24న అయోధ్యను సందర్శిస్తానని ఆయన తెలిపారు. అదేవిధంగా, బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీని కలిసి ధన్యవాదాలు తెలుపుతానని అన్నారు. అలాగే, ఆయనకు అభినందనలు తెలియజేస్తానన్నారు. ఈ అంశంపై ఆయన గతంలో ‘రథయాత్ర’ నిర్వహించిన విషయం తెలిసిందే. తప్పకుండా ఆయనను కలిసి ఆశీస్సులు తీసుకుంటానని ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.904
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles