ఆరు నెలల కూతురుతో కలిసి తండ్రి వ్యాయామం.. వీడియో

Thu,June 21, 2018 05:02 PM

This dad fitness routine with his daughters goes viral

ఈ ఫిట్‌నెస్ చాలెంజ్ పుణ్యమాని ప్రతి ఒక్కరు ఇప్పుడు ఫిట్‌నెస్‌పై పడ్డారు. సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు, పిల్లలు.. అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఫిట్‌నెస్ చాలెంజ్ అంటూ వాళ్లు చేసిన వ్యాయామానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అనంద పడుతున్నారు. రీసెంట్‌గా ప్రధాని మోదీ కూడా తన ఫిట్‌నెస్‌కు సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

ఇక.. ప్రస్తుతం మధ్య ప్రదేశ్‌కు చెందిన 45 ఏండ్ల ప్రమోద్ కార్పెంటర్ అనే వ్యక్తికి సంబంధించిన ఫిట్‌నెస్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అగర్ మాల్వాకు చెందిన ప్రమోద్ రోజూ ఉదయమే వ్యాయామం చేస్తాడట. అందులో వింతేమీ లేదు కాని.. ఆయనతో పాటు ఆయన కూతుళ్లు కూడా రోజూ వ్యాయామం చేస్తారు. ఇందులోనూ వింతేమీ లేదు.. కాని.. ఆయనతో వ్యాయామం చేసే కూతుళ్లలో పెద్ద కూతురు వయసు మూడేండ్లు, చిన్న కూతురు వయసు ఆరు నెలలు. చిట్టి చిట్టి అడుగులు వేసే చిన్నారులు కూడా తండ్రితో కలిసి సై అంటూ పోటీ పడి మరీ వ్యాయామాలు చేసే తీరును చూసి నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. ఆ చిన్నారుల చిట్టి పొట్టి వ్యాయామాన్ని చూసేయండి మరి..

3459
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS