ఇదో కొత్తరకం చోరీ..చూస్తే నవ్వు ఆపుకోలేరు:వీడియో వైర‌ల్‌

Sun,March 18, 2018 02:15 PM

Thief In Kanyakumari Uses Plastic Bag To Cover Face

కన్యాకుమారి: దొంగతనం చేస్తున్నప్పుడు తమను ఎవరూ గుర్తుపట్టకూడదనే ఉద్దేశంతో ముఖం కనిపించకుండా చాలా మంది మాస్క్‌లు ధరించి చోరీలకు పాల్పడిన సంఘటనలు ప్రతి ఒక్కరూ చాలానే చూసి ఉంటారు. సినిమాల్లో చూపించిన మాదిరిగానే బయటి ప్రపంచంలో కూడా నల్లటి ముసుగులు ధరించినవే ఎక్కువ కనిపిస్తాయి. ఐతే ముఖానికి పారదర్శక(transparent) పాలిథిన్ కవర్ పెట్టుకొని చోరీకి పాల్పడి.. కొన్ని గంటల్లోనే అరస్టైన వింత ఘటన తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారిలో జరిగింది.

కన్యాకుమారిలోని కొలాచెల్ ప్రాంతంలోని ఓ షాపులో విచిత్ర చోరీ జరిగింది. ఓ వ్యక్తి ముఖానికి పాలిథిన్ కవర్ పెట్టుకొని ఎవరూ చూడకముందు ఓ షాప్‌లోకి ప్రవేశించాడు. అందులోకి వెళ్లిన అతడు కొంత నగదును ఎత్తుకెళ్లాడు. ఇదంతా అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. మరుసటి రోజు షాప్ యాజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు సీసీటీవీ ఫుటేజిని పరిశీలించారు. అందులో చోరీకి పాల్పడిన వ్యక్తి ముఖం స్పష్టంగా కనిపిస్తోంది. అంతేగాక అతని ఎడమచేతికి టాటూ ఉన్నట్లు గుర్తించారు. దీని సాయంతో గంటల వ్యవధిలోనే పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో చూసిన నెటిజన్లు పడిపడి నవ్వుతున్నారు. పాపం ఇతనికి దొంగతనం కూడా చేయడం తెలియదని.. ముఖం అందరికీ కనబడేలా అతడు కవర్‌ను పెట్టుకోవడంపై తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

7711
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS