దొంగ 2.0.. అప్‌డేటెడ్ వర్షన్.. 'స్మార్ట్‌'గా ఫోన్‌ను కొట్టేశాడు.. వీడియో

Thu,February 21, 2019 06:03 PM

Thief flicks smartphone from shirt pocket of man in churchgate railway station

అప్‌డేట్ అవ్వండ్రా.. అని ఏదో సినిమాలో అన్నట్టుగా ఈ దొంగ భలే అప్‌డేట్ అయ్యాడు. రజినీకాంత్ రోబో సినిమా నుంచి రోబో 2.0 గా అప్‌డేటెడ్ వర్షన్‌ను తీసుకొచ్చినట్టు.. ఈ దొంగ కూడా 2.0 వర్షన్‌కు అప్‌డేట్ అయినట్టున్నాడు. లేకపోతే అంత స్మార్ట్‌గా ఫోన్‌ను ఎలా కొట్టేస్తాడు మరి. చాయ్ తాగుతున్న ఓ వ్యక్తి పైజేబులో ఉన్న ఫోన్‌ను క్షణాల్లో ఆ వ్యక్తి కళ్లముందే ఓ కవర్ అడ్డం పెట్టి.. అటు చూసి ఇటు చూసేలోగా కొట్టేశాడు. ఈ ఘటన ముంబైలోని చర్చ్‌గేట్ రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకున్నది. ఈ ఘటన రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు మాత్రం ఆ దొంగను.. అబ్బబ్బ.. దొంగంటే వీడురా. దొంగ 2.0.. అప్‌డేటెడ్ వర్షన్, దొంగలూ అప్‌డేట్ అయ్యారు.. ఈ స్మార్ట్ గాయ్‌కి ఆ స్మార్ట్ ఫోన్ ఇవ్వాల్సిందే అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు.


(Video Courtesy: The Times of India)

17993
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles