గుడ్డేలుగు చెట్టెక్కితే జనం నిప్పుపెట్టారు

Thu,November 15, 2018 05:05 PM

THEY LYNCHED THE WILD BEAR IN FRONT OF FORREST OFFFICALS

రానురాను మనుషుల్లో అమానుషత్వం ఎక్కువై పోతున్నదా? కర్నాటకలోని చిత్రదుర్గలో జరిగిన ఈ ఘటన చూస్తే అంతే అనిపించక మానదు. ఓ అడవి గుడ్డేలుగు జనావాస ప్రాంతంలోకి వచ్చింది. అందరూ అదిలించడంతో అది దగ్గరలోని ఓ చెట్టు ఎక్కింది. మనుషులు దాన్ని రాళ్లు, కర్రలు విసురుతుండడంతో అది భయంతో చెట్టు మీదే ఉండిపోయింది. ఇంకా పైపైకి పోయింది. ఈలోగా ఎవరో చెట్టుకు నిప్పు పెట్టారు. ఈ తతంగమంతా అటవీ అధికారులు గుడ్లప్పగించి చూస్తుండగానే జరిగింది. ఓ అమాయక మూగజీవంపై అంతమంది దాడిచేయడం, అధికారులు వారిని వారించకపోవడం దిగ్భ్రాంతి కలిగించే విషయం.

ఒంటికి సెగతగలడంతో అది చేసేది లేక చెట్టు మీద నుంచి దబ్బున కిందకు దూకింది. ఈలోగా దాని ఒళ్లు కొంత కాలిపోయింది. అప్పుడు అటవీ అధికారులు తీరికగా దానిని తీసుకువెళ్లి అడవిలో వదిలేశారు. గుడ్డేలుగు వెళ్లిపోయిన తర్వాత అగ్నిమాపక దళంవారు వచ్చి హడావుడి చేసి చెట్టుకు జనం పెట్టిన మంటలను ఆర్పేశారట. ఇదేనా వన్యమృగ సంరక్షణ? అనే ప్రశ్న అరణ్యరోదనే అవుతుందేమో.

2506
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles