బడ్జెట్ హైలైట్స్ ఇవీ..

Thu,February 1, 2018 01:38 PM

These are the highlights of Arun Jaitlys Budget

న్యూఢిల్లీః కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సార్వత్రిక ఎన్నికలకు ముందు తన చివరి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఇవాళ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. పెద్దగా మెరుపులు లేకపోయినా.. వ్యవసాయ రంగానికి ఊతం, ప్రపంచంలోనే అతి పెద్ద హెల్త్‌స్కీమ్‌లాంటివి కొన్ని సగటు జీవికి ఊరట కలిగించే అంశాలు. ప్రధానంగా జైట్లీ బడ్జెట్‌లో ఇవీ హైలైట్స్‌గా నిలిచాయి..

1. వ్యక్తిగత ఆదాయ పన్ను స్లాబ్ రేట్లలో ఎలాంటి మార్పు లేదు. గతంలో చాలా సానుకూల మార్పులు చేశామని, అందువల్ల ఈసారి వాటి జోలికి వెళ్లడం లేదని జైట్లీ స్పష్టంచేశారు.
2. జీతాలు పొందే వేతన జీవులకు ప్రయాణ అలవెన్సులు, వైద్య ఖర్చులకు బదులు రూ.40 వేలు స్టాండర్డ్ డిడక్షన్ అవకాశం కల్పించారు
3. వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి రూ. 2 వేల కోట్ల ఫండ్
4. దేశంలోని పది కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరేలా.. నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్‌ను ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల మేర మెడికల్ రీఎంబర్స్‌మెంట్ ఇవ్వనున్నారు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద హెల్త్ స్కీమ్ కావడం విశేషం.
5. సీనియర్ సిటిజన్ల బ్యాంక్ డిపాజిట్ల వడ్డీపై ఇక రూ.50 వేల వరకు పన్ను ఉండదు.
6. సౌభాగ్య యోజన కింద 4 కోట్ల ఇళ్లకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు
7. ఉజ్వల యోజన కింద పేద మహిళలకు 8 కోట్ల ఉచిత గ్యాస్ కనెక్షన్లు
8. అన్ని పంటలకు కనీస మద్దతు ధరను ఇవ్వనున్నారు.. ఇది ఉత్పత్తి ధర కంటే 1.5 రెట్లు ఉంటుంది.
9. అన్ని రంగాల్లో కొత్త ఉద్యోగుల వేతనాల్లో 12 శాతం ప్రభుత్వమే భరిస్తుంది.
10. రైల్వేలకు రూ.1.48 లక్షల కోట్లు కేటాయింపు
11. ఈ ఆర్థిక సంవత్సరం పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.80 వేల కోట్లు సమీకరించాలన్నది లక్ష్యం
12. ప్రతి ఐదేళ్లకు ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఎంపీల జీతాలు పెంచేలా చట్టం తీసుకురానున్నారు.
13. గ్రామీణ మౌలిక వ‌స‌తుల అభివృద్ధికి రూ.14.34 ల‌క్ష‌ల కోట్లు కేటాయింపు

4153
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles