రాఫెల్ ఒప్పందంలో అవినీతి లేదు: డ‌సాల్ట్ కంపెనీ

Wed,February 20, 2019 04:54 PM

There is no scandal with Rafale deal, says Dassault Aviation CEO Eric Trappier

హైద‌రాబాద్: రాఫెల్ యుద్ధ విమానాల కోనుగోలులో ఎటువంటి అవినీతి చోటుచేసుకోలేద‌ని డ‌సాల్ట్ ఏవియేష‌న్ కంపెనీ సీఈవో ఎరిక్ ట్రాపియ‌ర్ తెలిపారు. 36 రాఫెల్ విమానాలు కావాల‌ని భార‌త్ త‌మ‌ను కోరింద‌ని, వాటిని నిర్ణీత స‌మ‌యంలోనే డెలివ‌రీ చేస్తామ‌ని ఆయ‌న చెప్పారు. ఒక‌వేళ రాఫెల్ విమానాలు మ‌రిన్నికావాల‌ని భార‌త్ కోరితే.. ఎంతో సంతోషంగా అందిస్తామ‌ని ఆయ‌న తెలిపారు. రాఫెల్ డీల్‌లో భారీ కుంభ‌కోణం జ‌రిగిన‌ట్లు కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న విష‌యం తెలిసిందే. రాఫెల్ యుద్ధ విమానాల‌ను ఫ్రాన్స్‌కు చెందిన డ‌సాల్ట్ కంపెనీ త‌యారు చేస్తోంది. ఆ విమానాల త‌యారీని భార‌త్‌లో రిల‌య‌న్స్ సంస్థ‌కు అప్ప‌గించారు. అనిల్ అంబానీకి మేలు చేసేందుకు ప్ర‌ధాని మోదీ మ‌ధ్య‌వ‌ర్తిలా వ్య‌వ‌హ‌రించార‌ని ఇటీవ‌ల రాహుల్ ఆరోప‌ణ‌లు చేసిన విష‌యం తెలిసిందే.

972
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles