ఎంతమంది చనిపోయారో చెప్పలేం: రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్

Tue,March 5, 2019 03:55 PM

There is no number to give out says Nirmala Sitaraman on Balakot Attacks

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ జరిపిన దాడుల్లో 300 మందికిపైగా ఉగ్రవాదులు చనిపోయారని వార్తలు వచ్చాయి. దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోయినా.. దేశవ్యాప్తంగా మీడియా మొత్తం ఇదే రాసింది. అసలు ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయారో లెక్కించడం తమ పని కాదని ఐఏఎఫ్ చీఫ్ బీఎస్ ధనోవా కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ దాడులపై తొలిసారి రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. మీకు చెప్పడానికి ఎలాంటి సంఖ్య నా దగ్గర లేదు అని ఆమె అనడం గమనార్హం. అసలు దాడులు జరిగాయా, జరిగితే ఆధారాలు ఇవ్వండి అని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.


ముఖ్యంగా బీజేపీ చీఫ్ అమిత్ షా కూడా 250 మందికిపైగా చనిపోయినట్లు చెప్పిన మరుసటి రోజే రక్షణ మంత్రి సంఖ్యపై ఏమీ చెప్పలేమనడం మరిన్ని విమర్శలకు తావిచ్చినట్లయింది. విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే ఎంతమంది చనిపోయారో ఏమీ చెప్పలేదు. ఈ దాడులపై ఒక ప్రకటన మాత్రమే విడుదల చేశారు. దాడులపై అదే ప్రభుత్వ ప్రకటన అని ఆమె స్పష్టం చేశారు. ఇక ఈ దాడి మిలిటరీ చర్య కాదని కూడా ఆమె చెప్పారు. ఇండియాపై దాడికి పాకిస్థాన్‌లోని ఉగ్రవాదులు ప్రణాళిక రచిస్తున్నారన్న నిఘా వర్గాల సమాచారం మేరకే ఈ దాడులు చేశాం. ఇది మిలిటరీ చర్య కాదు అని నిర్మలా సీతారామన్ అన్నారు. ఈ దాడులకు, ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదని కూడా ఆమె చెప్పారు.

1910
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles