80 శాతం ఏటీఎంలలో క్యాష్ ఉంది : కేంద్ర మంత్రి

Thu,April 19, 2018 11:56 AM

There is cash in more than 80 % of the ATMs, says Shiv Pratap Shukla

న్యూఢిల్లీ: దేశంలోని 80 శాతం కంటే ఎక్కువ‌ ఏటీఎంలలో క్యాష్ ఉన్నట్లు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి శివ్ ప్రతాప్ శుక్లా తెలిపారు. నగదు కొరత అంశంపై ఆయన ఇవాళ స్పందించారు. కావాలనే కొందరు తమ ఇమేజ్‌ను పెంచుకునేందుకు దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. బ్యాంకుల గురించి కానీ ఏటీఎంల గురించి కానీ తప్పుడు ప్రచారం చేయరాదు అని ప్రజలను కోరుతున్నట్లు మంత్రి తెలిపారు. బీహార్‌లోని పట్నా ప్రజలు మాత్రం తమకు కావాల్సిన డబ్బు అందడం లేదని ఆరోపిస్తున్నారు. ఏటీఎంలలో క్యాష్ ఉండడం లేదని, నగదు కోసం ఏటీఎంల చట్టు తిరగాల్సి వస్తుందంటున్నారు. ముంబై ప్రజలు మాత్రం తమకు ఇబ్బందులు లేవన్నారు. అన్ని ఏటీఎం మెషీన్లు పని చేస్తున్నాయంటున్నారు.1719
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles