దేశంలో 18-19 ఏళ్ల మధ్య యువ ఓటర్లు ఎందరో తెలుసా?

Fri,March 15, 2019 02:55 PM

there are 15064824 voters in age group 18-19 yrs in country

ఢిల్లీ: దేశంలో రాష్ర్టాల వారిగా ఓటర్ల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. 2019 ఎన్నికల డేటా ప్రకారం దేశంలో 18 నుంచి 19 ఏళ్ల మధ్య వయస్సు యువ ఓటర్లు 1,50,64,824 మంది ఉన్నారు. దరఖాస్తు చేసుకున్న అర్హుల్లో ఫోటో గుర్తింపు కార్డుతో సహా ఇప్పటి వరకు 99.36 శాతం లక్ష్యాన్ని చేరుకున్నట్లు ఈసీ వెల్లడించింది. తెలుగు రాష్ర్టాల్లో కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకున్నవారు ఆంధ్రప్రదేశ్ 5,39,804 మంది ఉండగా తెలంగాణలో 5,99,933 మంది యువ ఓటర్లు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 2,95,18,964 ఓటర్లు ఉండగా వీరిలో పురుష ఓటర్లు-14,84,2619.. మహిళా ఓటర్లు- 14,67,4977, ఇతర ఓటర్లు- 1368 మంది ఉన్నారు.

1345
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles