చరిత్రలో తక్కువ రోజుల సీఎంలు వీళ్లే..

Sat,May 19, 2018 05:40 PM

The short-lived chief ministers

న్యూఢిల్లీ: అనుక్షణం.. ఉత్కంఠభరిత రాజకీయ పరిణామాల మధ్య రెండు రోజుల క్రితం సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన బీజేపీ శాసనసభాపక్ష నేత, కర్ణాటక ప్రస్తుత ముఖ్యమంత్రి యడ్యూరప్ప శనివారం సాయంత్రం విశ్వాస పరీక్షకు ముందు సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. భారతదేశ చరిత్రలో గతంలో రాష్ర్టాల్లో రాజకీయ సంక్షోభం తలెత్తినప్పుడు,మెజారిటీ లేక‌పోవ‌డం, విశ్వాస ప‌రీక్ష‌లో ప‌రాజ‌యం పాల‌వ‌డం త‌దిత‌ర కార‌ణాల‌తో కూడా కొంతమంది ముఖ్యమంత్రులు తప్పని పరిస్థితుల్లో రాజీనామాలు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

'ఒకే ఒక్కడు' సినిమాలో అర్జున్ ఒక్క రోజు ముఖ్యమంత్రిగా పనిచేసే విషయం మనందరికీ తెలిసిందే. అలా నిజజీవితంలో కూడా రాజకీయ సంక్షోభం కారణంగా ఒక్క రోజు ముఖ్యమంత్రిగా పనిచేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలా తక్కువ రోజుల పాటు అధికారంలో కొనసాగిన ముఖ్యమంత్రుల జాబితాను ఓసారి పరిశీలిద్దాం..!

హరీశ్ రావత్ : ఒక్క రోజు సీఎం..
ఉత్తరాఖండ్ (ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 22, 2016)

జగదాంబికా పాల్ : 2 రోజులు
ఉత్తర్‌ప్రదేశ్ (ఫిబ్రవరి 21 నుంచి 23, 1998)

యడ్యూరప్ప : 2 రోజులు
కర్ణాటక (మే 17 నుంచి 19, 2018)

ఓపీ చౌతలా: 5 రోజులు
హరియాణా(జులై 12 నుంచి 17, 1990)

సతీశ్ ప్రసాద్ సింగ్: 9 రోజులు
బిహార్ (జనవరి 27 నుంచి ఫిబ్రవరి 5, 1968)

ఎస్.సీ మరాక్: 11 రోజులు
మేఘాలయ (ఫిబ్రవరి 27 నుంచి మార్చి 10, 1998)

జానకీ రామచంద్రన్: 23 రోజులు
తమిళనాడు (జనవరి 7 నుంచి 30, 1988)

బీపీ మండల్: 26 రోజులు
బిహార్ (ఫిబ్రవరి 5 నుంచి మార్చి 2, 1968)

సీహెచ్ మొహమ్మద్ కోయ: 49 రోజులు
కేరళ (అక్టోబర్ 12 నుంచి డిసెంబర్ 1, 1979)

6071
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles