కశ్మీర్ పోలీసుల రాజీనామా వీడియోలు ఫేక్

Fri,September 21, 2018 04:53 PM

the police resignation videos of kashmir are fake, says home ministry

కశ్మీర్‌లో భద్రతాదళాలకు, ఉగ్రవాదులకు మధ్య సామాజిక మాధ్యమంలో యుద్ధం నడుస్తున్నది. ఇటీవల పోలీసులను లక్ష్యంగా చేసుకుని మిలిటెంట్లు దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ముగ్గురు పోలీసులను కిడ్నాప్ చేసి చంపేశారు. పోలీసు బలగంలో కొనసాగేవారందరికీ ఇదే గతి పడుతుందని మిలిటెంట్లు హెచ్చరించారు. పోలీసు ఉద్యోగాలకు కశ్మీరీలు రాజీనామా చేయాలని కూడా ఉగ్రవాదులు తాఖీదులిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ మీడియా సంచలనం సృష్టించింది. ఆ వీడియోలో ఓ వ్యక్తి నా పేరు ఇర్షాద్ అహ్మద్ బాబా.. నేను కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాను. నా ఉద్యోగానికి రాజీనామా చేశాను అని పేర్కొంటాడ. తర్వాత ఇలాంటివి మరికొన్ని వీడియోలు వచ్చాయి. అయితే ఇవన్నీ ఫేక్ వీడియోలని, కశ్మీర్‌లో పోలీసు ఉద్యోగాలకు ఎవరూ రాజీనామాలు చేయలేదని కేంద్రం హోంశాఖ వివరణ ఖండించింది. కశ్మీర్ పోలీసులు అంకితభావంతో పనిచేస్తున్నారని, వారు విధినిర్వహణలో ఎవరికీ తీసిపోరని హోంశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇదంతా దుష్టశక్తులు చేస్తున్న దుష్ప్రచారమని కొట్టిపారేసింది. కశ్మీర్‌లో రొటీన్ సిబ్బందితో పాటుగా 30 వేల వరకు ఎస్పీవోలు ఉంటారు. వీరు భద్రతా విధుల్లో పాల్గొంటారు. అయితే సర్వీసు కొనసాగింపు పొందని సిబ్బంది రాజీనామా చేసినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని హోంశాఖ తెలిపింది.

14679
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles