దశాబ్దపు విశిష్టతగా 'అయోధ్య' తీర్పు

Tue,December 3, 2019 09:57 AM

న్యూఢిల్లీ: అయోధ్య వివాదంపై అత్యున్నత న్యాయస్థానం వెల్లడించిన తీర్పు.. గత దశాబ్దంలో చోటుచేసుకున్న విశిష్ట ఘటనగా నిలిచింది. టాప్ ఇండియన్ ఈవెంట్స్ ఆఫ్ ది డికేడ్ పేరిట యాహూ ఇండియా వెలువరించిన జాబితాలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఇక ఆ తీర్పును వెల్లడించిన రాజ్యాంగ ధర్మాసనంలోని ఐదుగురు న్యాయమూర్తులు పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్‌గా (ఈ యేటి మేటి వ్యక్తి) నిలిచారు. ఘటనల జాబితాలో ఆర్టికల్ 370 రద్దు అంశం రెండో స్థానాన్ని దక్కించుకుంది. లక్షితదాడులు, జీఎస్టీ అమలు, బీజేపీ ఎదుగుదల, ఆర్టికల్ 377, నిర్భయ లైంగికదాడి కేసు, మంగళయాన్ మిషన్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఇక ఎక్కువ మంది సెర్చ్ చేసిన వ్యక్తుల జాబితాలో ప్రధాని మోదీ అగ్రస్థానం దక్కించుకున్నారు. ఈ జాబితాలో క్రికెటర్ ఎంఎస్ ధోనీ, నటి ప్రియాంక చోప్రా, వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్, మాజీ ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తదితరులకు చోటు దక్కింది. రాజకీయ నేతల జాబితాలో మోదీనే తొలిస్థానంలో నిలువగా, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీని వెనక్కి నెట్టి రెండో స్థానంలో నిలువడం విశేషం. పురుషులు, మహిళల సెలబ్రిటీల జాబితాలో సల్మాన్‌ఖాన్, సన్నీ లియోన్ అగ్రస్థానం దక్కించుకున్నారు.

591
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles