చిన్నారుల మృతి దురదృష్టకరం : యూపీ సీఎంSat,August 12, 2017 08:23 PM
చిన్నారుల మృతి దురదృష్టకరం : యూపీ సీఎం

లక్నో : గోరఖ్‌పూర్‌లోని బాబా రాఘవ్ దాస్ మెడికల్ కళాశాల(బీఆర్‌డీఎంసీ)లో గత ఐదు రోజుల్లో 63 మంది చిన్నారులు మృతి చెందడం దురదృష్టకరమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారుల మృతి పట్ల సీఎం సంతాపం తెలిపారు. చిన్నారులు మృతి చెందిన ఆస్పత్రికి ఆరోగ్య శాఖ మంత్రి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారని చెప్పారు యోగి. పిల్లల మృతిపై విచారణ జరిపిస్తున్నామని స్పష్టం చేశారు. ఆక్సిజన్ సరఫరా చేసే కంపెనీని కూడా విచారిస్తామని ఆయన తెలిపారు. బాధ్యులు ఎంతటి వారైనా వదిలిపెట్టబోమని సీఎం యోగి తేల్చిచెప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ వేశామని.. కమిటీ విచారణ జరుపుతుందని పేర్కొన్నారు సీఎం. ప్రధాని మోదీ కూడా చిన్నారుల మృతిపై ఆరా తీశారని తెలిపారు.

336
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS