త‌ప్ప‌క చ‌ద‌వాల్సిన ఓ ట్రాన్స్ జెండ‌ర్ స‌క్సెస్ స్టోరీ..!!

Sun,June 11, 2017 04:17 PM

The First Transgender HR Executive in Top MNC

ఇది ఓ ట్రాన్స్ జెండ‌ర్ స‌క్సెస్ స్టోరీ. ఆమె మాటల్లోనే త‌న స‌క్సెస్ స్టోరీ ని చ‌దువుదాం ప‌దండి... "నా పేరు నిషాంత్(అబ్బాయిగా ఉన్న‌ప్ప‌టి పేరు). నాకు సిగ్గెక్కువ‌. ఇంట్రోవ‌ర్ట్ ని. అయితే.. నాకు అమ్మాయిలా ఉండ‌టం ఇష్టం. అందుకే చిన్న‌ప్పుడు చాటు మాటుగా మా అమ్మ చీర‌ల‌ను క‌ట్టుకొని తెగ మురిసిపోయేవాడిని. అమ్మాయిల‌తోనే ఎప్పుడు తిరిగివాడిని. అబ్బాయిల‌తో అస్స‌లు మాట్లాడ‌క‌పోయేవాడిని. ఇంట్లో నాన్న ఎప్పుడూ నా మీద అరుస్తూ ఉండేవాడు. కాని..నేను మాత్రం మార‌లేదు. ఇంటికి చెడ పుట్టావు రా నువ్వు... ఫ్యామిలీకి మాయ‌ని మ‌చ్చ‌రా నువ్వు.. మా ప‌రువు గంగ‌లో క‌లుపుతున్నావు క‌ద‌రా అంటూ నాన్న న‌న్ను రోజు ఎత్తి పొడిచే వాడు. అయినా.. నేను మార‌లేదు.

చదువులో మాత్రం నేను ఫ‌స్ట్. టాప్ 3 లో ఎప్పుడూ ఉండేవాడిని. అయితే... స్కూల్ లో న‌న్ను ఎప్పుడూ ఏడిపించేవాళ్లు.. నా మీద జోక్స్ వేసుకునే వాళ్లు. నేను సెకండ్ ఇయ‌ర్ చ‌దువుతున్న‌ప్పుడు మా ప్రొఫెస‌ర్ జెన‌టిక్ డిజార్డ‌ర్స్, క్రోమోజోమ్స్ గురించి చెప్పిన‌ప్పుడు ఇంట‌ర్నెట్ లో దాని గురించి సెర్చ్ చేశాను. అప్పుడు అర్థ‌మ‌యింది నాలో ఓ అమ్మాయి ఉంద‌ని. ట్రాన్స్ జెండ‌ర్స్ గురించి తెలుసుకున్నాను. ఈ విష‌యాల‌న్నీ.. మా ఇంట్లో చెప్పినా.. అర్థం చేసుకునే వాళ్లు ఎవ‌రూ లేరు. అందుకే..రెండేళ్ల క్రితం ఇంట్లో నుంచి బ‌య‌టికి వ‌చ్చేశాను.

త‌ర్వాత ఎన్నో జాబ్స్ కు ట్రై చేశాను. కాని.. నా గురించి తెలిసి... జాబ్ ఇవ్వ‌డానికి ఎవ్వ‌రూ ముందుకు రాలేదు. త‌ర్వాత ఓ ఫ్రెండ్ ద్వారా ఓ ఎంఎన్సీలో ట్రాన్స్ జెండ‌ర్స్ కోస‌మే రిక్రూట్ మెంట్ జ‌రుగుతుంద‌ని తెలుసుకొని.. ఇంట‌ర్వ్యూ కు అటెండ్ అయ్యాను. అదృష్ట‌వ‌శాత్తు ఆ జాబ్ నాకు వ‌చ్చింది. ఇప్పుడు టాప్ ఎంఎన్సీలో హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ గా వ‌ర్క్ చేస్తున్నాను. నాకు ఇప్పుడు అర్థ‌మ‌యింది.. జీవితంలో ఏదైనా సాధించాలంటే ప‌ట్టుద‌ల‌, కృషి ఉంటే చాలు. ఎటువంటి అవ‌రోధాలు వ‌చ్చినా.. అన్నీ నామ‌మాత్ర‌మేన‌ని. ఇప్పుడు నాకు ప్ర‌పంచాన్నే జ‌యించినంత సంతోషంగా ఉంది.. ఆఫీస్ లోనూ నాతో అంతా క‌లిసి మెలిసే ఉంటారు. లేడీస్ టాయిలెట్ నే నేను ఉప‌యోగిస్తాను. ఇది నా స్టోరీ... ఇంత‌కీ నా పేరు చెప్ప‌లేదు క‌దూ.. నా పేరు జ‌రా ష‌యికా(అమ్మాయిగా మారిన త‌ర్వాత పేరు)" అంటూ ముగించేసింది జ‌రా.

2865
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles