ఆ శునకంపై లైంగికదాడి జరగలేదట

Wed,November 21, 2018 05:55 PM

THE DOG WAS NOT RAPED MEDICAL REPORTS CONFIRM

ముంబైలోని మాల్వానీ ప్రాంతంలో సంచలనం సృష్టించిన కుక్క కేసు కొత్త మలుపు తిరిగింది. దానిపై లైంగికదాడి జరిగిందని జంతుసంరక్షణ సంస్థ చేసిన ఆరోపణ నిజంకాదని తేలింది. కుక్కపై జరిపిన వైద్యపరీక్షల్లో ఆ సంగతి రుజువైనట్టు మాల్వానీ పోలీసులు తెలిపారు. అయితే దానిని తీవ్రంగా హింసించిన మాట నిజమేనని వారు నిర్ధారించారు. ఎప్పుడూ ఓ చర్చి దగ్గర తిరిగే ఓ కుక్క ఒకరోజంతా కనిపించలేదు. కుక్కలకు ప్రతిరోజూ తిండిపెట్టే ఓ మహిళ ఈ సంగతి గమనించారు. మరుసటి రోజు కుక్క తిరిగివచ్చినప్పటికీ అది గాయాలతో మూలుగుతూ తిండి తినలేదు.

వంటినిండా గాయాలు రక్తమోడుతున్నాయి. మనుషులను దగ్గరకు రానివ్వడం లేదు. వెనుకకాళ్లను విరిచికట్టేందుకు నిందితులు ప్రయత్నించినట్టు తెలుస్తున్నది. కుక్కను తీవ్రంగా కొట్టి హింసించినట్టు గుర్తులున్నాయి. దీనిపై ఫిర్యాదు అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు. కుక్కను వైద్య పరీక్షలకు పంపారు. ప్రస్తుతం అది ఓ కుక్కల దవాఖానలో కోలుకుంటున్నది. నిందితులు మాత్రం ఇంతవరకు దొరకలేదు. పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తున్నారు.

3329
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles