HomeLATEST NEWSTerrorists Shotdead a youth in pulwama District

యువకుడిని కాల్చి చంపిన ఉగ్రవాదులు

Published: Wed,March 13, 2019 08:34 PM
  Increase Font Size Reset Font Size decrease Font size   

పుల్వామా: దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు 25 ఏళ్ల యువకుడిని కాల్చి చంపేశారు. ఇవాళ మధ్యాహ్నం పుల్వామా జిల్లాలోని పింగ్లీనా గ్రామంలో ఈ దారుణం వెలుగుచూసింది. దీంతో సమాచారం అందుకున్న భద్రతా బలగాలు ఉగ్రవాదులను పట్టుకునేందుకు కార్డన్ సెర్చ్ చేపట్టాయి. మృతుడిని జాక్లీకి చెందిన ఆషిక్ హుస్సేన్‌గా గుర్తించారు. కొందరు సాయుధ దుండగులు ముసుగులతో వచ్చి..నాయక్ మోహల్లాలోని ఇంటి దగ్గర ఉన్న ఆషిక్ హుస్సేన్ పై కాల్పులు జరిపి..పారిపోయారు. తీవ్రగాయాలతో ఉన్న ఆషిక్ హుస్సేన్ ను ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
3169
Tags

More News

NATIONAL-INTERNATIONAL

SPORTS

Health

Technology