కిడ్నాప్ చేసి ప్రాణం తీసిన ఉగ్రవాదులు

Sat,November 25, 2017 11:13 PM

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు ఒక జవానును పొట్టనపెట్టుకున్నారు. దక్షిణకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో ఇర్ఫాన్ అహ్మద్ దార్ అనే 23 ఏండ్ల సైనికుడిని కిడ్నాప్ చేసి కాల్చిచంపారు. బుల్లెట్లతో ఛిద్రమైన జవాను మృతదేహాన్ని తాము కనుగొన్నామని సైనికాధికారులు శనివారం తెలిపారు. షోపియాన్ జిల్లా సెంజెన్ గ్రామానికి చెందిన దార్ టెరిటోరియల్ ఆర్మీవిభాగంలో బండిపొరా జిల్లాలో పని చేస్తున్నాడని, కొద్దిరోజుల క్రితం అతను సెలవుపై వెళ్లాడని, అప్పుడే అతడిని ఉగ్రవాదులు అపహరించి హత్యచేసి ఉంటారని రక్షణశాఖ ప్రతినిధి తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. దార్ హత్యను జమ్ముకశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తి, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా ఖండించారు. కశ్మీర్‌లో శాంతిస్థాపనకు తాము చేస్తున్న కృషిని ఇటువంటి ఘటనలు నీరుగార్చలేవని సీఎం అన్నారు.

951
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles