ఎమ్మెల్యేకు ఎన్‌ఐఏ నోటీసు

Thu,September 28, 2017 11:36 PM

Terror funding crackdown NIA summons independent JK MLA

శ్రీనగర్ : ఉగ్రవాదులకు నిధులు అందజేసిన కేసులో ఇప్పటివరకు జమ్ముకశ్మీర్‌కు చెందిన వ్యాపారవేత్తలకు నోటీసులిచ్చిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) తొలిసారిగా ఓ ఎమ్మెల్యేకు సమన్లు జారీచేసింది. ఉత్తరకశ్మీర్‌లోని లగాటే నియోజకవర్గ స్వతంత్య్ర ఎమ్మెల్యే షేక్ అబ్దుల్ రషీద్, అలియాస్ రషీద్ ఇంజినీర్‌కు నోటీసులు పంపినట్టు అధికారులు గురువారం తెలిపారు. అక్టోబర్ మూడున తమ ఎదుట విచారణకు హాజరుకావాలని రషీద్‌కు పంపిన నోటీసుల్లో పేర్కొన్నది. కశ్మీర్‌లోయలో వేర్పాటువాద నేతలు, ఉగ్రవాద బృందాలకు నిధులు సమకూర్చుతున్నాడనే ఆరోపణలపై గతంలో అరెస్టయిన వ్యాపారవేత్త జహూర్ వతాలి విచారణలో రషీద్ పేరు తెరపైకి వచ్చింది. నిషేధిత ఉగ్రవాద సంస్థలు హిజ్బుల్ ముజాహిద్దీన్, లష్కరే తాయిబా, దుక్‌తేరాన్ ఈ మిలాత్‌తోపాటు ఇతర సంస్థలు, గ్రూపులతో వేర్పాటువాదులు, వేర్పాటువాద నేతలు సంబంధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలతో పలువురిపై మే 30న ఎన్‌ఐఏ కేసు నమోదు చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా ఇప్పటికే పలువురికి నోటీసులు జారీచేసిన ఎన్‌ఐఏ.. తాజాగా ప్రధాన రాజకీయ నేతలకు నోటీసులు పంపుతున్నది.

1283
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles