విక్ర‌మ్ డేటా కోసం నిరీక్ష‌ణ‌.. ఇస్రోలో టెన్ష‌న్‌

Sat,September 7, 2019 02:12 AM

హైద‌రాబాద్‌: అత్యంత క్లిష్ట‌మైన ప‌వ‌ర్ డిసెంట్ ఆప‌రేష‌న్‌ను ఇస్రో శాస్త్ర‌వేత్త‌లు నిర్వ‌ఘ్నంగా నిర్వ‌హించారు. ఉత్కంఠ క్ష‌ణాల మ‌ధ్య ఆ ఆప‌రేష‌న్ కొన‌సాగింది. చుంద్రుడి ఉప‌రిత‌లానికి అత్యంత స‌మీపంలో నిర్వ‌హించే వ‌ర్టిక‌ల్ డిసెంట్ ఆప‌రేష‌న్ కూడా అద్భుతంగా సాగింది. కానీ ఫ్ల‌యిట్ డేటాలో కొంత డీవియేష‌న్ క‌నిపించింది. దీంతో విక్ర‌మ్ ల్యాండింగ్‌పై ఉత్కంఠ నెల‌కొన్న‌ది. విక్ర‌మ్ డేటా కోసం శాస్త్ర‌వేత్త‌లు ఎదురుచూశారు. చంద్రుడి ఉప‌రితలానికి 2.1 కిలోమీట‌ర్ల ఎత్తులో ఉన్న‌ప్ప‌టి నుంచి విక్ర‌మ్ సిగ్న‌ల్స్ అంద‌డం లేద‌ని ఇస్రో చైర్మ‌న్ శివ‌న్ తెలిపారు. ల్యాండ‌ర్ నుంచి క‌మ్యూనికేష‌న్ అంద‌డం లేద‌ని ఇస్రో చైర్మ‌న్ శివ‌న్ ప్ర‌క‌ట‌న చేశారు.


ఆప‌రేష‌న్ స‌మ‌యంలో చంద్రుడి ఉప‌రితలానికి విక్ర‌మ్ స‌మీపిస్తున్నా కొద్దీ ఉత్కంఠ రెట్టింపు అయ్యింది. కీల‌క ఆప‌రేష‌న్ సుమారు 16 నిమిషాల పాటు సాగిన‌ట్లు తెలుస్తోంది. మిష‌న్ కంట్రోల్ రూమ్‌ ఊపిరాడ‌ని టెన్ష‌న్‌తో నిండిపోయింది. మోదీతో పాటు సుమారు 84 మంది విద్యార్థులు ఆప‌రేష‌న్‌ను ప్ర‌త్య‌క్షంగా వీక్షించారు. శాస్త్ర‌వేత్త‌లు నిరంతరం విక్ర‌మ్ ల్యాండింగ్ అంశాన్ని ప‌రిశీలిస్తూనే ఉన్నారు. విక్ర‌మ్ ల్యాండింగ్ క‌న్ష‌ర్మేష‌న్ గురించి శాస్త్ర‌వేత్త‌లు కొంత టైమ్ తీసుకున్నారు. ఆ స‌మ‌యంలో అంద‌రిలోనూ ఉత్కంఠ నెల‌కొన్న‌ది. ప్ర‌ధాని మోదీకి మిష‌న్ గురించి ఓ ద‌శ‌లో ఇస్రో చైర్మ‌న్ శివ‌న్ వివ‌రించారు.


విక్ర‌మ్ ల్యాండింగ్ గురించి శాస్త్ర‌వేత్త‌లు తీవ్రంగా చ‌ర్చించారు. ప్ర‌క‌ట‌న చేసేందుకు చాలా స‌మ‌యం తీసుకున్నారు. ఫ్ల‌యిట్ డేటాను ప‌రిశీలించేందుకు శాస్త్ర‌వేత్త‌ల‌కు ఎక్కువ స‌మ‌య‌మే ప‌ట్టింది. ఇస్రో సెంట‌ర్‌లో ఆస‌క్తిక‌ర వాతావ‌ర‌ణం నెల‌కొన‌డంతో అస‌లు ఏం జ‌రుగుతుంద‌న్న అంశం అర్థంకాలేదు. చంద్రుడికి 300 మీట‌ర్ల ద‌గ్గ‌ర వ‌ర‌కు విక్ర‌మ్ ల్యాండ‌ర్ చేరుకున్న‌ది. అక్క‌డ నుంచి సిగ్న‌ల్స్ చేరివేత‌లో లోపం ఎదురైన‌ట్లు తెలుస్తోంది. ల్యాండింగ్ గురించి ప్ర‌క‌ట‌న చేయ‌డంలో ఇస్రో జాప్యం చేసింది. దీంతో ఉత్కంఠం మ‌రింత పెరిగింది. ప్ర‌ధాని మోదీ కూడా తాను కూర్చున్న సీటు నుంచి లేచి వెళ్లారు.

2092
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles