శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్ నరసింహన్

Tue,April 9, 2019 10:25 AM

Telugu States Governor ESL Narasimhan visited Tirumala Tirupati Devastam

తిరుపతి: ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్‌ నరసింహన్ మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో గవర్నర్ దంపతులు స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, ఆలయ అర్చకులు ఆలయ మహాద్వారం వద్ద గవర్నర్ దంపతులకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదశీర్వచనం చేయగా.. ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందచేసి శ్రీవారి వస్త్రంతో దంపతులను సత్కరించారు. రాష్ట్ర ప్రజలు సుఖఃసంతోషాలతో ఉండాలని.. తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు నరసింహన్. అనంతరం పద్మావతి అతిధి గృహం చేరుకున్న ఆయన మధ్యాహ్నం హైదరాబాదుకు తిరుగుపయనం కానున్నారు.

595
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles