నెట్ న్యూట్రాలిటీకి ఓకే చెప్పిన టెలికాం క‌మిష‌న్‌

Thu,July 12, 2018 10:06 AM

Telecom Commission gives green signal to Net Neutrality

న్యూఢిల్లీ: నెట్ న్యూట్రాలిటీకి టెలికాం కమీషన్ ఓకే చెప్పేసింది. ఈ ప్రక్రియతో ప్రతి ఒక్కరికీ ఇంటర్నెట్ ఒకేరకమైన వేగంతో అందుతుంది. నెట్ న్యూట్రాలిటీ పద్ధతిని అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. టెలికాంతో పాటు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు .. ఇంటర్నెట్ డేటాను సమానంగా సరఫరా చేయాల్సి ఉంటుంది. ప్లాట్‌ఫామ్ ఏదైనా, అప్లికేషన్ ఏదైనా, యూజర్ ఎవరైనా, కాంటెంట్ ఏదైనా అందరికీ ఒకేరకమైన వేగంతో ఇంటర్నెట్ అందజేయడమే నెట్ న్యూట్రాలిటీ లక్ష్యం.

ఇంటర్నెట్ డేటాను ప్రొవైడ్ చేస్తున్న సంస్థలు కాంటెంట్‌ను బ్లాక్ చేయడం కానీ, స్పీడ్ తగ్గిండచం కానీ చేయకూడదు. టెలికం శాఖకు చెందిన టెలికాం కమీషన్ నెట్ న్యూట్రాలిటీపై బుధవారం కీలక నిర్ణయం తీసుకున్నది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా చేసిన ప్రతిపాదనలకు అనుగుణంగానే టెలికాం కమీషన్ నెట్ న్యూట్రాలిటీకి గ్రీన్ సిగ్నల్ చెప్పినట్లు టెలికాం సెక్రటరీ అరుణా సుందరరాజన్ తెలిపారు.

నెట్ న్యూట్రాలిటీపై ట్రాయ్ చేసిన సిఫార్సుల పట్ల ఇంటర్నెట్ సంస్థలు, టెలికం ఆపరేటర్ల నుంచి గ‌తంలో విరుద్ధ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇంటర్నెట్ సేవల సంస్థలు ప్రశంసించగా, టెలికం కంపెనీలు.. ఈ అంశానికి ట్రాయ్ చాలా చిన్న నిర్వచనం చెప్పిందన్నాయి. వాట్సప్, స్కైప్, వైబర్, గూగుల్ డ్యుయో వంటి లైసెన్సింగ్ యాప్స్ లేదా వెబ్‌సైట్లు అందిస్తున్న కాల్స్, మెసేజ్‌లకు సంబంధించిన అంశాలపై ట్రాయ్ దృష్టి పెట్టినట్లు లేదని విమర్శించాయి. జాతి అవసరాలకు సంబంధించిన ఈ అంశంపై సంకుచిత ధోరణి తగదన్నాయి.

898
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles