ప్రజాస్వామికంగానే తెలంగాణ ఏర్పాటు : ఎంపీ జితేందర్‌రెడ్డి

Fri,July 20, 2018 12:39 PM

telangana state forms is democratically says MP Jitender reddy

న్యూఢిల్లీ : టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ మరోసారి తెలంగాణపై అక్కసు వెల్లగక్కారు. అవిశ్వాసంపై చర్చ సందర్భంగా మాట్లాడిన జయదేవ్ తన ప్రసంగం చివరలో.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాన్ని అప్రజాస్వామికంగా, అశాస్త్రీయంగా విభజించారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్ ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల పూర్తి మద్దతుతోనే తెలంగాణ బిల్లు ఆమోదం పొందిందని ఎంపీ జితేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో ఆమోదం పొందిన బిల్లు అప్రజాస్వామికం ఎలా అవుతుందని ప్రశ్నించిన ఆయన.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రజాస్వామికంగానే జరిగిందని తేల్చిచెప్పారు. అప్రజాస్వామిక అనే మాటను లోక్‌సభ రికార్డుల్లో నుంచి తొలగించాలని స్పీకర్‌కు జితేందర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

ప్రసంగం మొదట్లో కూడా జయదేవ్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాన్ని అప్రజాస్వామికంగా విభజించారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన అనంతరం కొత్తగా ఏర్పడింది ఆంధ్రప్రదేశ్.. తెలంగాణ కాదు అని పేర్కొన్నారు. తెలుగు తల్లిని కాంగ్రెస్ రెండుగా చీల్చింది అని మోదీ అన్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ.. తల్లిని చంపి బిడ్డను బతికించిందని మోదీనే అన్నారని జయదేవ్ పేర్కొన్నారు. జయదేవ్ వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్ ఎంపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

4776
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles