బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్‌లో ముగిసిన తెలంగాణ క్రాస్ ఎగ్జామినేషన్

Wed,September 19, 2018 07:33 PM

telangana cross examination over in brijesh kumar tribunal

న్యూఢిల్లీ: కృష్ణా నది నీటి పంపకాలపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్‌లో తెలంగాణ క్రాస్ ఎగ్జామినేషన్ ముగిసింది. క్రాస్ ఎగ్జామినేషన్ మూడు రోజుల పాటు కొనసాగింది. గోదావరి నదిపై కడుతున్న ప్రాజెక్టులపై ఏపీ తరపు సాక్షి విశ్వేశ్వరరావుని తెలంగాణ తరుపు న్యాయవాది వైద్యనాథన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. గతంలో ఏపీ లేవనెత్తిన సందేహాలకు 15 రోజుల సమయం కావాలని తెలంగాణ కోరింది. తెలంగాణ అడిగిన సమయానికి ధర్మాసనం అనుమతి తెలపడంతో.. తదుపరి విచారణను అక్టోబర్ 3కు వాయిదా వేశారు.

759
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles