సీఎం ప్రమాణ స్వీకారం తర్వాత ప్రధానిని కలవడం ఆనవాయితీ!

Wed,December 26, 2018 01:12 PM

Telangana CM KCR to meet PM Modi in New Delhi today

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీతో ఇవాళ సాయంత్రం సీఎం కేసీఆర్ సమావేశమవుతారని ఎంపీ వినోద్ కుమార్ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత భారత ప్రధానిని కలవడం ఆనవాయితీ అని వినోద్ వివరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. రాష్ర్టానికి సంబంధించిన అంశాలపై సీఎం కేసీఆర్ ప్రధానితో చర్చిస్తారు.

ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై కొన్ని పార్టీలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయి. ఏ రోజు టీఆర్‌ఎస్ పార్టీ బీజేపీకి మద్దతు తెలపలేదు. కాంగ్రెస్, బీజేపీలు గత 60ఏళ్లుగా ప్రాంతీయ పార్టీల మద్దతుతోనే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. పాలనలో ప్రాంతీయ పార్టీలకు జాతీయ పార్టీలు అవకాశం ఇవ్వలేదు. అందుకే ప్రాంతీయ పార్టీలను ఏకం చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ శ్రమిస్తున్నారని పేర్కొన్నారు.

4226
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles