ఇది ఒక్క నా బీజేపీలోనే సాధ్యం: తేజస్వీ సూర్య

Tue,March 26, 2019 10:14 AM

Tejasvi Surya is the BJP candidate from Bangalore South seat

బెంగళూరు: యువ న్యాయవాది, బీజేపీ రైజింగ్‌ స్టార్‌ తేజస్వీ సూర్య కర్ణాటకలోని బెంగళూరు సౌత్‌ సీటుకు నామినేట్‌ అయ్యారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ స్థానం నుంచే బరిలోకి దిగబోతున్నట్లుగా మొదట్లో చర్చలు నడిచాయి. అర్థరాత్రి దాకా కొనసాగిన చర్చల అనంతరం తేజస్వీ సూర్య పేరును ఖరారు చేస్తూ నియోజకవర్గ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. కర్ణాటకలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ఏప్రిల్‌ 18వ తేదీన జరగనుంది. తన అభ్యర్థిత్వంపై తేజస్వీ ట్విట్టర్‌ ద్వారా స్పందిస్తూ.. ఓ మై గాడ్‌.. ఓ మై గాడ్‌.. నేను ఇది నమ్మలేకపోతున్నా. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్రమోదీ, అతిపెద్ద రాజకీయ పార్టీకి అధ్యక్షుడు అమిత్‌ షా ఈ 28 ఏండ్ల యువకుడిపై నమ్మకం ఉంచారు. ప్రతిష్టాత్మక స్థానం బెంగళూరు సౌత్‌ నుంచి రిప్రజెంట్‌ చేసేందుకు అవకాశం ఇచ్చారు. ఇటువంటి చర్య ఒక్క నా బీజేపీలోనే సాధ్యం. మోదీ నేతృత్వంలోని సరికొత్త భారత్‌లోనే ఇది సాధ్యమని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి అనంత కుమార్‌ బెంగళూరు సౌత్‌ నుంచి ప్రాతినిధ్యం వహించారు. గతేడాది ఇయన మరణించారు. తేజస్వీ సూర్య అరైజ్‌ ఇండియా అనే సామాజిక సంస్థను స్థాపించారు. కర్ణాటకలో బీజేపీ ఐటీ సెల్‌ నిర్వహణ చూస్తున్నాడు. అదేవిధంగా కర్ణాటక హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టిస్‌ చేస్తున్నాడు. కాంగ్రెస్‌ వెటరన్‌ బీకే హరిప్రసాద్‌తో తేజస్వీ సూర్య ఈ ఎన్నికలో తలపడుతున్నారు.

1411
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles