సైకిలెక్కిన ఐశ్వర్యరాయ్.. ఫోటో వైరల్

Thu,May 17, 2018 09:58 AM

Tej Pratap Yadav takes Aishwarya Rai on a bicycle ride

పాట్నా: ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ఈ నెల 12వ తేదీన ఆ రాష్ట్ర మాజీ మంత్రి ప్రసాద్ రాయ్ మనమరాలు ఐశ్వర్య రాయ్‌ను పెళ్లి చేసుకున్నారు. ఆ వేడుకకు సంబంధించిన అనేక ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. అయితే తాజాగా ఓ ఫోటో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. కొత్త దంపతులు తేజ్ ప్రతాప్, ఐశ్వర్యరాయ్‌లు సైకిల్ ఎక్కారు. భార్య ఐశ్వర్యను సైకిల్‌పై కూర్చోబెట్టుకుని.. ఆ సైకిల్‌ను తేజ్ ప్రతాప్ తొక్కుతున్న ఫోటో ఒకటి ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది. పాట్నా వీధుల్లో సైకిల్ తొక్కుతున్నట్లు తేజ్ ప్రతాప్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ ఫోటోను అప్‌లోడ్ చేశారు. కుర్తా పైజామాలో తేజ్ ప్రతాప్, కాషాయ రంగు చీరలో ఐశ్వర్య రాయ్.. అందర్నీ ఆకట్టుకున్నారు. వివాహ బంధం సంతోషంగా సాగాలంటూ పాట్నా ప్రజలు ఆ జంటను దీవించారు.

5294
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS