శివుని వేషధారణలో తేజ్ ప్రతాప్ యాదవ్ పూజలు

Tue,July 23, 2019 04:23 PM

Tej Pratap Yadav dressed as Lord Shiva and offers pooja to shiva


పాట్నా: బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ శ్రావణమాసాన్ని పురస్కరించుకుని శివునికి ప్రత్యేక పూజలు చేశారు. శ్రావణమాసంలోని తొలి సోమవారం (జులై 22న) రోజున తేజ్ ప్రతాప్ యాదవ్ శివుడి వేషధారణలో ఆలయానికి వెళ్లి..ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. చేతులు, నుదుటిన విభూతి, తెలుపు రంగు ధోతి, మెడలో రుద్రాక్ష మాల ధరించి తేజ్ ప్రతాప్ పూజ చేశారు.

గతేడాది శ్రావణ మాసంలో తేజ్ ప్రతాప్ యాదవ్ డియోగఢ్ లోని బాబా బైద్యనాథ్ ధామ్ ఆలయాన్ని సందర్శించారు. దీంతోపాటు పాట్నాలోని శివాలయంలో పూజలు నిర్వహించారు. బీహార్ ప్రజలు ప్రతీ ఏడాది శ్రావణ మాసంలో బాబా బోలేనాథ్ (శివుడు) నామస్మరణ చేస్తుంటారు. ఉత్తరభారతదేశంలోని రాజస్థాన్, పంజాబ్, యూపీ, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో శ్రావణమాసం ఈ ఏడాది జులై 17న ప్రారంభమై ఆగస్టు 15న ముగుస్తుంది.

1025
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles