గుజరాత్ ఎన్నికల డేట్ ఎందుకు ప్రకటించలేదంటే..Thu,October 12, 2017 06:17 PM

గుజరాత్ ఎన్నికల డేట్ ఎందుకు ప్రకటించలేదంటే..

న్యూఢిల్లీ: ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. వచ్చే నెల 9న పోలింగ్ జరగనుండగా.. డిసెంబర్ 18న ఫలితాలు వెలువడుతాయని సీఈసీ ఏకే జ్యోతి వెల్లడించారు. హిమాచల్‌తోపాటు కీలకమైన గుజరాత్ ఎన్నికల నగారా కూడా ఇవాళే మోగుతుందని అంతా భావించారు. రెండు రాష్ర్టాలకు ఒకేసారి షెడ్యూల్ విడుదల చేయనున్నారని ఉదయం నుంచీ వార్తలు వచ్చాయి. అయితే ఎన్నికల సంఘం మాత్రం కేవలం హిమాచల్ డేట్లు ప్రకటించి.. గుజరాత్‌ను మాత్రం పెండింగ్‌లో పెట్టింది. డిసెంబర్ 18లోపు జరుగుతాయని మాత్రం తెలిపింది. దీని వెనుక ఓ సాంకేతిక కారణం ఉన్నట్లు ఏకే జ్యోతి చెప్పారు. ప్రస్తుతం ఎన్నికల నిర్వహణకు సంబంధించి కాల పరిమితి నిబంధన ఉన్నందున గుజరాత్ షెడ్యూల్ విడుదల చేయలేదని ఆయన వెల్లడించారు. ఈ కాల పరిమితి 46 రోజులుగా ఉంది. అంటే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన 46 రోజుల్లోపు ఎన్నికలు పూర్తి కావాల్సి ఉంటుంది. అయితే హిమాచల్ ఎన్నికల ఫలితాలు గుజరాత్‌పై ప్రభావం చూపకుండా ఉండేందుకు డిసెంబర్ 18లోపే ఎన్నికలు నిర్వహిస్తామని ఏకే జ్యోతి స్పష్టంచేశారు.

1681
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS