హవ్వ.. స్కూల్‌లో ఇలాంటి పనులా..?

Thu,November 8, 2018 11:34 AM

teachers indecent behavior in school

గుజరాత్: విద్యార్థులకు చదువులు చెప్పి వారి బంగారు భవితకు బాటలు వేయాల్సిన గురువులే స్కూల్‌లో నీచపు పనికి పాల్పడ్డారు. విద్యార్థులు లేని సమయంలో తరగతి గదిలో అసభ్యకరంగా ప్రవర్తించారు. గుజరాత్‌లోని దహోద్ జిల్లాలో ఉన్న ఓ ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన తాజాగా చోటు చేసుకుంది. పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు తన తోటి ఉపాధ్యాయురాలిని కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నాడు. వారి తంతు అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కాగా, ఆ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. దాన్ని చూసిన స్థానికులు అక్కడి జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన డీఈవో ఘటనపై విచారణకు ఆదేశించారు. ఆ ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామన్నారు. వారం రోజుల్లోగా ఘటనపై నివేదిక అందజేయాలని సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.


6942
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles