ఎన్‌ఐఏ కస్టడీలో టీచర్ మృతి

Tue,March 19, 2019 03:27 PM

Teacher Rizwan Asad Pandit dies in NIA custody

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌కు చెందిన ఓ టీచర్.. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) కస్టడీలో ఉండగా మృతి చెందాడు. టీచర్ రిజ్వాన్ అసద్ పండిట్‌కు ఉగ్రవాద కేసుతో సంబంధం ఉందని భావించిన ఎన్‌ఐఏ.. అతడిని మూడు రోజుల క్రితం అదుపులోకి తీసుకుంది. ఎన్‌ఐఏ కస్టడీలో ఉండగానే టీచర్ మృతి చెందినట్లు పోలీసులు ధృవీకరించారు. మృతుడిని పుల్వామా జిల్లాలోని అవంతిపురాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. విచారణలో ఉండగానే మంగళవారం రాత్రి రిజ్వాన్ మృతి చెందాడు. టీచర్ మృతితో ముందస్తు జాగ్రత్తగా ఇస్లామిక్ యూనివర్సిటీని పోలీసులు మూసేశారు. అయితే టీచర్ మృతిపై నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఓమర్ అబ్దుల్లా స్పందించారు. ఈ కేసు విచారణను సకాలంలో పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. టీచర్ మృతికి కారణమైన వారికి కఠిన శిక్ష విధించాలన్నారు.

2112
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles