క్లాసుకు లేటయ్యారని విద్యార్థులను చితకబాదాడు.. వీడియో..

Thu,June 20, 2019 10:07 PM

teacher punished 12 students brutally for coming late to class

జమ్మూ: క్లాసుకు లేటుగా వచ్చారని కొందరు విద్యార్థులను ఓ ఉపాధ్యాయుడు చితకబాదాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన జమ్మూ కాశ్మీర్‌లోని దొడా పట్టణంలో చోటు చేసుకుంది. అక్కడి గుజ్జార్, బేకర్‌వాల్ హాస్టల్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మహమ్మద్ యాసీన్ క్లాసుకు ఆలస్యంగా వచ్చారని చెప్పి 12 మంది విద్యార్థులను కర్రతో చితకబాదాడు. ఈ ఘటనకు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా దొడా డిప్యూటీ కమిషనర్ డాక్టర్ సాగర్ డి దాయ్‌ఫొడె యాసీన్‌ను వెంటనే సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించారు. స్థానిక తహసీల్దార్ షబీర్ అహ్మద్ మాలిక్‌ను విచారణాధికారిగా నియమిస్తూ సాగర్ ఉత్తర్వులు జారీ చేశారు. 15 రోజుల్లోగా ఈ ఘటనపై తనకు నివేదిక అందించాలని మాలిక్‌ను సాగర్ ఆదేశించారు.

2759
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles